Share News

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్.. కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటింగ్

ABN , Publish Date - Nov 06 , 2026 | 03:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. ఏపీవ్యాప్తంగా మొత్తం 211 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది.

 ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్.. కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటింగ్
AP MPTC ZPTC Re Polling

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్ ప్రక్రియ ఈరోజు (శుక్రవారం) కొనసాగుతోంది. ఏపీవ్యాప్తంగా మొత్తం 211 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు సగటున 41.74 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు 12.56 శాతం, ఉదయం 11 గంటలకు 26.95 శాతంగా పోలింగ్ రికార్డైంది .


అత్యధికంగా కర్నూలు జిల్లా కోసిగి, అర్లబండలో 53.35 శాతం పోలింగ్ నమోదైంది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు, గంగవరంలో 51.19 శాతం పోలింగ్ శాతం రికార్డు అయింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 49.9 శాతం, పల్నాడు జిల్లా క్రోసూరు, అండుకూరులో 39.37 శాతం, అనంతపురం జిల్లా కుడేరు, మరుట్లలో 39.29 శాతం, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడులో 32.23 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, పొన్నంలో 26.82 శాతం పోలింగ్ రికార్డు అయింది.


చీరాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

మరోవైపు, బాపట్ల జిల్లాలోని చీరాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 20 వార్డుల్లో ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ - 13, వైసీపీ - 3, కాంగ్రెస్ - 4 వార్డులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి హనీ స్పందన 2,900 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.


గన్నవరంలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గన్నవరం సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ అధికారులకు స్వయంగా శిక్షణ సూచనలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ

ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు

కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 03:46 PM