Share News

పార్టీ నిర్ణయమే ఫైనల్.. నేతలకు మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:22 PM

టీడీపీ నేతలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా నేతలంతా ఏబీసీ ఫార్ములా అనుసరించాలని మార్గనిర్దేశం చేశారు.

పార్టీ నిర్ణయమే ఫైనల్.. నేతలకు మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం
Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలకు ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా నేతలంతా ఏబీసీ(Always be campaign) ఫార్ములా అనుసరించాలన్నారు. సరైన ప్రణాళిక(ఏబీసీ) అనే ఈ సూత్రంతో నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయం తీసుకునే ముందు వరకూ ఎవరు ఎంతైనా తమ అభిప్రాయాలను బలంగా వినిపించవచ్చని పేర్కొన్నారు. ఒకసారి పార్టీ నిర్ణయం జరిగాక నేతలు ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈనెల 28న యలమంచిలిలో శంకుస్థాపన చేసే బ్లూ జెట్ పరిశ్రమ ద్వారా రూ.2300 కోట్ల పెట్టుబడి ఏపీకి రానుందని చెప్పుకొచ్చారు.


మానవీయ సంబంధాలు ముఖ్యం..

ఏఐ, క్వాంటం ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలూ అంతే ముఖ్యమని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్ర ముగిశాక టీడీపీ నేతలందరితో సరదాగా మాట్లాడేవాడినని, అధికారంలోకి వచ్చాక కూడా ఆ హ్యూమన్ రిలేషన్ మిస్ కాకూడదని చెప్పారు. తనకు నాయకులు అంతా తెలుసు.. కానీ వారి కుటుంబ సభ్యులు కొంతమంది తెలీదని చెప్పుకొచ్చారు. నేతల కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ఏటా కలిసేలా ప్రణాళిక చేసుకున్నానని తెలిపారు.


ఇంకో 2కిలోలు బరువు తగ్గాలి..

రాత్రి 9:30 దాటినా ఆత్మీయ సమావేశం నుంచి కదిలేందుకు నేతలు ఇష్టపడలేదని లోకేశ్ అన్నారు. అంత సరాదాగా తెలియకుండానే సమయం గడిచిపోయిందన్నారు. బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారని, ఇంకో 2 కిలోల వరకు బరువు తగ్గితే తన లక్ష్యం పూర్తవుతుందని తెలిపారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటం ప్రతిపక్షంలో అలవాటైందని పేర్కొన్నారు. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో.. నేతలతో హ్యూమన్ టచ్ అంతే అవసరమన్నారు. ఈ విషయం ప్రధాని మోదీ నుంచే నేర్చుకున్నానని వివరించారు. మోదీ ప్రధానిగా ఎంత బిజీగా ఉన్నా నేతలు ఎవరికైనా బాగోపోతే పర్సనల్‌గా ఫోన్ చేసి వారి బాగోగులు తెలుసుకుంటారనేది కొందరికే తెలుసునని చెప్పుకొచ్చారు. క్వాంటం, ఏఐలని సీఎం చంద్రబాబు చూసుకుంటారని, తాను మానవీయ సంబంధాలు చూసుకుంటానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 01:29 PM