హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్
ABN , Publish Date - Feb 25 , 2026 | 07:59 PM
ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో (AP High Court) ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ (Sunil Naik) ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
రఘురామ అరెస్ట్ సమయంలో ఏపీ సీఐడీ ఎస్పీగా ఆయన ఉన్నారు. రెండు రోజుల క్రితం సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఎస్పీ దామోదర్ బిహార్ వెళ్లారు. ఈ క్రమంలోనే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించింది బిహార్ కోర్టు. దీంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు సునీల్ నాయక్. ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు(గురువారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..
Read Latest Telangana News And AP News And Telugu News