Share News

మోదీ నాయకత్వంలో అణు రంగంలో దూసుకుపోతున్న భారత్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:21 PM

దేశ అణుశక్తి ప్రయాణంలో కీలక ముందడుగు పడటం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తెలిపారు. స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిందన్నారు.

మోదీ నాయకత్వంలో అణు రంగంలో దూసుకుపోతున్న భారత్: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 07: దేశ అణుశక్తి ప్రయాణంలో కీలక ముందడుగు పడటం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తెలిపారు. స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిందన్నారు. దేశ అణు కార్యక్రమంలో రెండో దశకు ముఖ్యమైన మైలురాయి సాధించామని తెలిపారు. మోదీ నాయకత్వంలో అణుశక్తి రంగంలో భారత్ దూసుకుపోతుందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు.


తమిళనాడులోని కల్పక్కంలో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ పాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దీంతో దేశ అణు కార్యక్రమంలో రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత శాస్త్రీయ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొంటూ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ప్రధాని అభినందనలు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

సీఎం భార్యపై పాస్‌పోర్ట్ ఆరోపణలు.. పవన్ ఖేడా ఇంటికి పోలీసులు

కేసీఆర్‌ను మార్చినట్లే.. పినరయి విజయన్‌ను మార్చేస్తారు: రేవంత్‌రెడ్డి

For More AP News And Telugu News

Updated Date - Apr 07 , 2026 | 05:24 PM