Share News

గుంటూరు సబ్‌జైలు ఘటనలో సజ్జల, పెద్దిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:48 PM

గుంటూరు జిల్లా సబ్‌జైలు వద్ద అలజడులు సృష్టించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ.. టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే వారు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.

గుంటూరు సబ్‌జైలు ఘటనలో సజ్జల, పెద్దిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
tdp complaint on ycp leaders

గుంటూరు, నవంబర్ 17: జిల్లాలోని సబ్‌జైలు వద్ద అలజడులు సృష్టించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ.. టీడీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు గాయపడడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల కోసం పనిచేసే పోలీసులపై దాడి చేయడం అమానుషమైన చర్య అని మండిపడ్డారు. జిల్లా సబ్‌జైలులో ఉన్న అప్పిరెడ్డిని పరామర్శించే పేరుతో సజ్జల, పెద్దిరెడ్డి.. జైలు వద్ద అలజడులు సృష్టించారని.. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే వారు ఈ దాడులకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు.


ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడారు. ‘జైలులో అప్పిరెడ్డిని పరామర్శించే పేరుతో వైసీపీ నేతలు అలజడులు సృష్టించారు. విధుల్లో ఉన్న పోలీసులపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ప్రజల రక్షణ, శాంతిభద్రతల కోసం పని చేసే పోలీసులపై దాడి జరిగితే కేసు పెట్టకపోవడం బాధాకరం.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని వైసీపీ నేతలు దెబ్బతీస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు అనేక హైడ్రామాలకు తెర తీస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు గాయపడటానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలి’ అని మాణిక్యరావు డిమాండ్ చేశారు.


టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో గెలవలేక వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి నేర చరిత్ర గుంటూరు జిల్లా వాసులందరికి తెలుసు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి బ్యాలెట్ బాక్సులను లాక్కొని ఆందోళన చేయడం ఏంటి..? ఇప్పటికైనా పోలీసులపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 08:48 PM