జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర..?
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:54 AM
జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్‌తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.
గుంటూరు జిల్లా, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్‌తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం. శ్రీనివాస యాదవ్ ఈరోజు (సోమవారం) ఉదయం జిమ్‌కు వెళ్లే క్రమంలో హత్య చేయాలని పథకం రచించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఓ గ్యాంగ్ రెండుసార్లు ఆయన కోసం రెక్కీ చేసింది.
వైసీపీ హయాంలో నరేంద్రరెడ్డి ఎన్నో అరాచకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నరేంద్రరెడ్డి అరాచకాలను బోనబోయిన శ్రీనివాస యాదవ్ అడ్డుకున్నాడు. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెమ్మసాని చంద్రశేఖర్‌పై నరేంద్రరెడ్డి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నరేంద్రరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుట్ర బయట పడటంతో పరారీలో నరేంద్రరెడ్డి ఉన్నాడు. వైసీపీ నేత నరేంద్రరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్‌మెంట్‌కు దాతలు ముందుకు రావాలి: పెమ్మసాని చంద్రశేఖర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News