జగన్ హయాంలో విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:18 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
అమరావతి, జనవరి25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Gottipati Ravi Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అప్పుల ఊబిలో ముంచి డిస్కంలను నిర్వీర్యం చేశారని ఆగ్రహించారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పునర్జీవం తెచ్చిందని పేర్కొన్నారు.
సీఎం సంస్కరణలతోనే డిస్కంలకు దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు వచ్చాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు. ఆదివారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో రాష్ట్ర డిస్కంల పనితీరుకు ఉన్నత రేటింగ్‌లు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
సాంకేతిక, వాణిజ్య నష్టాలను గణనీయంగా తగ్గించడం, విద్యుత్ బిల్లుల వసూలు సామర్థ్యాన్ని పెంచడం వలనే ఇది సాధ్యమైందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలను జాప్యం లేకుండా విడుదల చేశామని వెల్లడించారు. ఈ చర్యలతో డిస్కంల పనితీరు మెరుగుపడిందని తెలిపారు. ఇవే దేశ స్థాయిలో రేటింగ్‌లు పెరగడానికి కారణమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి
బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Read Latest AP News And Telugu News