ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:38 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఆదివారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలిదశలో 100 పట్టణ స్థానిక సంస్థలకు (13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలు) ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఆదివారం) జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలిదశలో 100 పట్టణ స్థానిక సంస్థలకు (13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలు) ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 13 మేయర్, 70 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బరిలో 153 మంది మేయర్ అభ్యర్థులు, 367 మంది మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 3,942 వార్డు స్థానాలకు గానూ 755 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ జరగనున్న 3,186 వార్డుల్లో 9,742 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్ల సంఖ్య 99.36 లక్షలు ఉండగా.. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్యే అత్యధికం (51.05 లక్షలు), పురుష ఓటర్లు 48.29 లక్షలు ఉన్నారు.
మొత్తం 12,244 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, ఏకగ్రీవాలు మినహాయించి 11,378 కేంద్రాల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు 14,628 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలు: 3,535, అతి సమస్యాత్మక: 2,131, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు: 71లను గుర్తించారు. ఎన్నికల సిబ్బంది: 13,504 మంది, ప్రిసైడింగ్ అధికారులు: 13,504 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు: 51,716 మంది, ఇతర పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం: 138 కౌంటింగ్ కేంద్రాలు, 556 కౌంటింగ్ హాళ్లు, 6,831 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ విధుల్లో 27,324 మంది అసిస్టెంట్లు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News