Share News

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

ABN , Publish Date - Apr 30 , 2026 | 07:02 PM

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట
Raghu Rama Krishnaraju

ఢిల్లీ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు (Raghu Rama Krishnaraju) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు (A-2) బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు వ్యక్తిగతంగా రఘురామ ఈరోజు (గురువారం) హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో అరెస్ట్ చేయొద్దని ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. రూ. 50,000 షురిటీ బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది.


ఈ కేసులో ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా ఊరట లభించింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సుమారు 15 వేల పేజీలకు పైగా ఉండటంతో, ఆ పత్రాల పరిశీలనకు నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరారు. పత్రాల పరిశీలన (Scrutiny) కోసం తదుపరి విచారణను జులై 6, 2026కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కంపెనీల లిక్విడేషన్ స్థితిగతులను తెలపాలని సంబంధిత అధికారులను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 07:30 PM