Share News

మొరాయించిన పంటల బీమా పోర్టల్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 08:00 AM

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్‌ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్‌ ఓపెన్‌ కావట్లేదు. నేషనల్‌ క్రాప్‌ ఇన్యూరెన్స్‌ పోర్టల్‌, పీఎంఎ్‌ఫబీవై పోర్టల్‌.. ఏదీ ఓపెన్‌ కావట్లేదని రైతులు వాపోతున్నారు.

మొరాయించిన పంటల బీమా పోర్టల్‌

  • 3 రోజుల్లో ముగియనున్న గడువు

  • గడువు పెంచాలని రైతుల డిమాండ్‌

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్‌ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్‌ ఓపెన్‌ కావట్లేదు. నేషనల్‌ క్రాప్‌ ఇన్యూరెన్స్‌ పోర్టల్‌, పీఎంఎఫ్‌బీవై పోర్టల్‌.. ఏదీ ఓపెన్‌ కావట్లేదని రైతులు వాపోతున్నారు. వరి రైతులకు ఈ నెల 15వ తేదీతో బీమా గడువు ముస్తుండగా, పోర్టల్స్‌ మొరాయించడంతో బీమా చేసుకోలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు ముందుగా స్వీయ ధ్రువీకరణ పత్రం (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) ఇచ్చి, బీమా ప్రీమియం చెల్లించవచ్చని వ్యవసాయ శాఖ చెప్తోంది.


కానీ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా బీమా పోర్టల్స్‌లోనే అప్‌లోడ్‌ చేయాలి. పోర్టల్స్‌ ఓపెన్‌ కావట్లేదని రైతులు వాపోతున్నారు. ఈ-క్రాప్‌ చేయించకోకపోయినా.. స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్తున్న అధికారులు.. బీమా పోర్టల్స్‌ ఓపెన్‌ కాకపోవడంపై స్పందించడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే వరికి మినహా ఇతర ఖరీఫ్‌ పంటలకు గడువు ముగిసిపోయింది. వరికి మాత్రం మరో మూడు రోజులే గడువు ఉంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఈ పోర్టల్స్‌ స్తంభించాయి. దీంతో బీమా పోర్టల్స్‌ ఓపెన్‌ అయ్యేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, బీమా గడువు పెంచాలని వరి సాగుదారులు కోరుతున్నారు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 08:01 AM