Share News

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు.. ప్రారంభించనున్న సీఎం

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:30 AM

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు రానున్నాయి. రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించనున్నారు.

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు..  ప్రారంభించనున్న సీఎం
AP Fire Fighting Vehicles

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు రానున్నాయి. రూ.40 కోట్లతో 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు, 20 వాటర్‌ బౌజర్లు, 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను సీఎం లాంఛ్ చేయనున్నారు.


గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను అధికారులు వినియోగించనున్నారు. పెద్ద అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్‌ బౌజర్లు ఉపయోగపడనున్నాయి. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను అధికారులు వినియోగించనున్నారు. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.


వార్తలు కూడా చదవండి...

సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్

సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 10:46 AM