Share News

సాగునీటి ప్రాజెక్టులను జలహారతి ద్వారా పర్యవేక్షించాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:05 PM

సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను జలహారతి కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారులను ఆదేశించారు.

సాగునీటి  ప్రాజెక్టులను జలహారతి ద్వారా పర్యవేక్షించాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను జలహారతి కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu).. అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో వాటర్ రెగ్యులేటరీ కమిషన్ తీసుకువచ్చే అంశంపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు.


రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ఈ సమీక్షలో చర్చించారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 01:48 PM