CM Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు... సమైక్యత అవసరం
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:04 PM
నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలంటే... మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా... తెలుగే మాతృభాష అని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే... సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి... ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని వెల్లడించారు. గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని వివరించారు. ఆంధ్ర ప్రాంతంలో చాగల్‌నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తీసుకువచ్చామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చామని అన్నారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చిందని వివరించారు, ప్రత్యేక చట్టం రూపొందించిందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా తాను ఏనాడు అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి మూడువేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని చెప్పుకొచ్చారు. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం జరుగుతుందని వెల్లడించారు. ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని అన్నారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి... అన్ని మాట్లాడటం లేదని అన్నారు..ఐక్యత గురించే తాను మాట్లాడతానని చెప్పుకొచ్చారు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు తాను అడ్డుపడలేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరమని చెప్పుకొచ్చారు. నీటి విషయంతో పాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలని సూచించారు. గంగా-కావేరి కలవాలని.. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలని.. అదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కావాలని అన్నారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదని వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో.. తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News