Share News

CM Chandra babu: పెట్టుబడులపై సీఎం స్పెషల్ ఫోకస్.. దావోస్‌‌లో పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు..

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu), మంత్రులు, అధికారుల బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం దావోస్ బయలుదేరారు.

CM Chandra babu: పెట్టుబడులపై సీఎం స్పెషల్ ఫోకస్.. దావోస్‌‌లో పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు..
Chandra babu Naidu

అమరావతి, జనవరి18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu), మంత్రులు, అధికారుల బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం దావోస్ బయలుదేరారు. గన్నవరం నుంచి ఢిల్లీకి సీఎం బృందం వెళ్లారు. సీఎం చంద్రబాబు వెంట దావోస్ బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.


ఢిల్లీలో ఈరోజు రాత్రి 1.45 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం భారత కాలమానం ప్రకారం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జ్యూరిచ్‌లోని స్విట్జర్లాండ్‌ భారతీయ రాయబారి మృదుల్ కుమార్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం సీఎంతో ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్ సమావేశం కానున్నారు.


సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం బృందం పాల్గొననుంది. ఈ సమావేశంలో తెలుగువారిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. డయాస్పోరా సమావేశం అనంతరం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్‌కు సీఎం వెళ్లనున్నారు. దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

For More TG News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 10:11 PM