Share News

బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న కృషి చేశారు: చంద్రబాబు, లోకేశ్

ABN , Publish Date - Aug 16 , 2026 | 10:13 AM

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న కృషి చేశారు: చంద్రబాబు, లోకేశ్
Sardar Gautu Latchanna Jayanti

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

గౌతు లచ్చన్న తెలుగు నేల రాజకీయాలను ప్రభావితం చేశారు: సీఎం చంద్రబాబు

దేశానికి స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా తెలుగు నేల రాజకీయాలను సర్దార్ గౌతు లచ్చన్న ప్రభావితం చేశారని సీఎం చంద్రబాబు కొనియాడారు. పార్టీలకు అతీతంగా, బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితమంతా అంకితం చేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు


సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం: లోకేశ్

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమానికి గౌతు లచ్చన్న విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన తన జీవితాన్ని రైతులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రశంసించారు. గౌతు లచ్చన్న తెలుగు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని లోకేశ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని

‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’

తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 11:08 AM