Share News

బాపట్లలో విషాదం.. విద్యుత్ ప్రమాదంలో మేనమామ, మేనల్లుడి మృతి

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:51 PM

బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనికి వెళ్లిన మేనమామ, మేనల్లుడు అనంత లోకాలకు చేరారు.

బాపట్లలో విషాదం.. విద్యుత్ ప్రమాదంలో మేనమామ, మేనల్లుడి మృతి
electrical accident

చీరాల, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): పొట్టకూటి కోసం పనికి వెళ్లిన మేనమామ, మేనల్లుడు అనంత లోకాలకు చేరారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ హృదయ విదారక సంఘటన ఈరోజు (బుధవారం) బాపట్ల జిల్లాలోని తోటవారి పాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


పేరాల వైకుంఠపురం జాలమ్మ గుడి సమీపంలో కత్తి ఇస్సాక్(29) నివసిస్తున్నారు. ఆయనకు తిరువళ్ల శ్యామ్(24) అనే మేనల్లుడు ఉన్నారు. వీరిద్దరూ ఫ్లోరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు (బుధవారం) ఓ ఇంట్లో ఫ్లోర్ మార్బుల్ పాలిష్ చేయడానికి మరికొందరితో కలిసి వెళ్లారు. మధ్యాహ్నం వరకు పని చేశారు. భోజనం అనంతరం పని ప్రారంభించగా పాలిషింగ్ మిషన్‌కు విద్యుత్ సరఫరా అయింది. దీంతో క్షణాల్లోనే ఇస్సాక్, శ్యామ్ కుప్పకూలారు.


సమాచారం అందుకున్న ఈపూరుపాలెం ఎస్పై రామాంజనేయులు విద్యుత్ అధికారులతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతులు ఇద్దరు అవివాహితులు కావడం బాధాకరం.


ఈ వార్తలూ చదవండి

అనకాపల్లి జిల్లాలో విషాదం.. శారదా నది కాలువలో యువతి మృతదేహం..

ఒంగోలులో దారుణం... బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నం

Updated Date - Sep 30 , 2026 | 08:53 PM