Share News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. శారదా నది కాలువలో యువతి మృతదేహం..

ABN , Publish Date - Sep 30 , 2026 | 09:21 AM

అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలోని శారదా నది బట్టి కాలువలో 19 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది.

అనకాపల్లి జిల్లాలో విషాదం.. శారదా నది కాలువలో యువతి మృతదేహం..
Sharada River Canal

అనకాపల్లి, సెప్టెంబర్ 30: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో శారదా నది బట్టి కాలువలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలిని అదే గ్రామానికి చెందిన తాడి పూర్ణ (19)గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 27న ఉదయం తల్లిదండ్రులకు తెలియకుండా పూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆమె తల్లి తాడి శారద రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా.. తాజాగా కాలువలో మృతదేహం కనిపించడంతో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


ఇదిలా ఉంటే.. పూర్ణకు ఇష్టం లేని వివాహం నిశ్చయించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మృతికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్ణ ఇంటి నుంచి వెళ్లిన పరిస్థితులు, ఆమె ఎక్కడికి వెళ్లింది అన్న విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..

భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..

Updated Date - Sep 30 , 2026 | 01:14 PM