ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:56 PM
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీలో రేపటి(గురువారం) ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి రానుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్నే అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మీడియాతో అయ్యన్నపాత్రుడు చిట్‌చాట్ చేశారు. పార్లమెంట్‌లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని స్పష్టం చేశారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని తెలిపారు.
అసెంబ్లీ సభ్యుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పీకర్ చెప్పుకొచ్చారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామన్నారు. ప్రస్తుతం.. ఏర్పాటుచేసే కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్.. దేశంలోనే అత్యుత్తమంగా ఉండనుందని వివరించారు. చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో కొత్త అసెంబ్లీ వ్యూ అత్యద్భుతంగా ఉంటుందని తెలిపారు. 2028 డిసెంబర్ అసెంబ్లీ సమావేశాలు.. నూతన భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో ఉంచుకుని పెరగనున్న అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాల దృష్ట్యా 300కు పైగా సీటింగ్ కొత్త సభలో ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..
మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ.!
Read Latest Telangana News And AP News And Telugu News