Share News

వార్డుల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 39 పురపాలక సంస్థలకు డెడ్‌లైన్లు ఇవే..

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:53 PM

వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన గడువు తేదీలను ఏపీ మునిసిపల్ శాఖ ప్రకటించింది.

వార్డుల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 39 పురపాలక సంస్థలకు డెడ్‌లైన్లు ఇవే..
AP Ward Delimitation

అమరావతి, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని 39 పురపాలక సంఘాలు (ULBs), నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన (Delimitation) ప్రక్రియకు సంబంధించిన గడువు తేదీలను ఏపీ మునిసిపల్ శాఖ ప్రకటించింది.


విజయవాడ, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, చిత్తూరుతో పాటు పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, రామచంద్రపురం, జగ్గయ్యపేట, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, మార్కాపురం, చీరాల, ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగరి, పుత్తూరు, కదిరి, యర్రగుంట్ల, జమ్మలమడుగు, పలమనేరులలో సెప్టెంబర్ 3, 2026 నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.


GVMC (విశాఖపట్నం), ఏలూరు, మచిలీపట్నం, పెడన, పిఠాపురం, ఒంగోలు, గుంటూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాలలో సెప్టెంబర్ 8, 2026 నాటికి వార్డుల విభజన పూర్తి చేయడానికి గడువు విధించింది. చిలకలూరిపేట, నెల్లూరు నగర పాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబర్ 15, 2026 నాటికి పూర్తిచేసేలా ఏపీ మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 09:06 PM