ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్‌ఈసీ సిద్ధం
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:29 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమైంది.మొత్తం 23 స్థానిక సంస్థలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం సిద్ధమైంది. మొత్తం 23 స్థానిక సంస్థలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 1009 వార్డులు.. కార్పొరేషన్లు- 260, మున్సిపాలిటీల్లోని - 749 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య - 24,98,152.. రెండోదశలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్లు - 12,92,989 మంది కాగా, పురుష ఓటర్లు - 12,04,753 మంది ఉన్నారు. పోలింగ్ కోసం మొత్తం - 2,801 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
4 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఎస్ఈసీ ఖరారు చేశారు. మంగళగిరి-తాడేపల్లి మేయర్ స్థానం ఎస్టీ(జనరల్)కు, రాజమహేంద్రవరం ఎస్సీ (జనరల్)కు కేటాయించారు. కాకినాడ మేయర్ స్థానం బీసీ (మహిళ)కు, శ్రీకాకుళం మహిళ (జనరల్)కు రిజర్వ్ చేశారు. 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాల్లో మహిళలకు పెద్దపీట వేశారు. 19 ఛైర్‌పర్సన్ స్థానాల్లో 10 స్థానాలు మహిళలకే (అన్ని కేటగిరీల్లో కలిపి) రిజర్వ్ చేశారు.
ఆయా కార్పొరేషన్లలో పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.5000, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.2500 డిపాజిట్ చేయాలని షరతు విధించారు. మున్సిపాలిటీల్లో పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.1500 డిపాజిట్ చేయాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితి రూ.25 లక్షలకు (జీవీఎంసీ మినహా) విధించారు. మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితి గరిష్ఠంగా రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఏపీవ్యాప్తంగా 15 జిల్లాల్లోని 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండో దశ ఎన్నికల కోలాహలం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు
తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి
పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News