Share News

గ్రామపంచాయతీ ఎన్నికలు.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు: ఎస్ఈసీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:26 PM

గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్‌ పర్యవేక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు: ఎస్ఈసీ
AP SEC Anil Chandra Punetha

విజయవాడ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC Anil Chandra Punetha) పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్‌ పర్యవేక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూడు దశల గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు (మంగళవారం) విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏడీజీపీ మధుసూదన్ రెడ్డి సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు.


19శాతం వరకూ ఏకగ్రీవాలు జరిగాయి..

ఆయా గ్రామపంచాయతీలు ఏకగ్రీవాలు అయ్యాయని అనిల్ చంద్రా పునేఠా తెలిపారు. ఆశించినంతగా ఏకగ్రీవాలు జరగలేదని చెప్పారు. 19శాతం వరకూ ఇవి జరిగాయని వెల్లడించారు. బలవంతంగా ఏకగ్రీవాలు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల కోసం పోలీసు బలగాలు అదనంగా విధుల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. డీజీపీ కార్యాలయం నుంచి సైతం బలగాలు విధుల్లో పాల్గొంటాయని అన్నారు. పల్నాడుతో పాటు పలు జిల్లాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాలో ఒక అభ్యర్ధిని నాలుగుసార్లు పోటీ చేయకుండా కొంతమంది అడ్డుకున్నారని అన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను ఏపీ డీజీపీకి పంపించామని.. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారని అనిల్ చంద్రా పునేఠా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 03:23 PM