Share News

నేషన్ ఫస్ట్ గవర్నెన్స్‌పై ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ

ABN , Publish Date - Apr 22 , 2026 | 07:40 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగ‌పూర్‌లో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌ ముగిసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత‌, అన‌గాని స‌త్య‌ప్రసాద్, అచ్చెన్నాయుడు, స‌త్య‌కుమార్ ఉన్నారు.

నేషన్ ఫస్ట్ గవర్నెన్స్‌పై ఏపీ మంత్రులకు సింగపూర్‌లో శిక్షణ
AP Ministers Singapore Visit

ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగ‌పూర్‌లో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌ (AP Ministers Singapore Visit) ముగిసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత‌, అన‌గాని స‌త్య‌ప్రసాద్, కింజరాపు అచ్చెన్నాయుడు, స‌త్య‌కుమార్ ఉన్నారు. ఈరోజు (బుధవారం) ఉద‌యం సింగ‌పూర్ హోంమంత్రి ష‌ణ్ముగంతో మంత్రులు సమావేశం అయ్యారు.

AP-MINISTRES-2.jpg


నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం అందించడం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి సమన్వయంతో పనిచేసే విధానం వంటి అంశాలపై మంత్రులు చర్చించారు. మ‌ధ్యాహ్నం సింగ‌పూర్ సిటీ గ్యాల‌రీని మంత్రులు సంద‌ర్శించారు. గ‌డిచిన 50 ఏళ్ల‌లో సింగ‌పూర్ అభివృద్ది చెందిన విధానం, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లతో ఉన్న గ్యాల‌రీని సంద‌ర్శించారు.

AP-MINISTRES-1.jpg


సింగ‌పూర్ కో ఆప‌రేష‌న్ ఎంట‌ర్ ప్రైజ్ ఆధ్వ‌ర్యంలో గ‌వ‌ర్నెన్స్ ఎక్స్‌లెన్స్ ప్రోగ్రాంపై శిక్ష‌ణ‌ పొందారు. సింగ‌పూర్ ప్ర‌ధాని స్ట్రాట‌జీ గ్రూప్‌లో భాగంగా ఉన్న సెంట‌ర్ ఫ‌ర్ స్ట్రాట‌జిక్ ఫ్యూచ‌ర్స్ సంస్థ‌ను మంత్రులు సంద‌ర్శించారు. నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ఆఫ్ సింగ‌పూర్ సిటీస్(NUS Cities)ను సంద‌ర్శించారు. సింగపూర్‌లో ఆధునిక నగరాల అభివృద్ధి, భవిష్యత్తు సవాళ్లపై సింగ‌పూర్ సిటీస్ ప‌నిచేస్తోంది. దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక, భూ వినియోగ పాలన, ప్రభుత్వ శాఖలు - సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాల‌పై సింగ‌పూర్ ప్ర‌తినిధులు వివ‌రించారు.

AP-MINISTRES-3.jpg


AP-MINISTRES-4.jpg

ఈ వార్తలు కూడా చదవండి...

పెద్ద దస్తగిరి హత్య వెనక వైసీపీ పెద్దల హస్తం: మంత్రి కొలుసు పార్థసారథి

ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో విద్యా పథకం

విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 07:43 PM