వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:51 PM
తనపై, ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఐదుమీటర్లకు ఒక చెట్టు పెంచాలని సంకల్పించామని తెలిపారు.
నెల్లూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): తనపై, ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ(AP Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు పెంచాలని సంకల్పించామని తెలిపారు. తన అభ్యర్థన మేరకు దాతలు ముందుకొచ్చారని తెలిపారు. ఓ దాత రూ.2 కోట్లు ఇచ్చారని.. ఒక్క పైసా కూడా కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. VR హైస్కూల్ రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ నారాయణ గ్రూప్స్ నుంచి ఉచితంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. 10 బస్సులకు అయ్యే ఖర్చు నారాయణ విద్యాసంస్థలే భరిస్తున్నాయని వెల్లడించారు. యూనియన్ బ్యాంక్ 4 బస్సులు ఇచ్చిందని.. వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులను నారాయణ విద్యాసంస్థలే భరిస్తున్నాయని తెలిపారు.
పేదరికం వల్ల తాను నడిచి స్కూలుకు వెళ్లేవాడినని.. ఆ కష్టం పిల్లలకు రాకూడదనే... తమ సొంత నిధులు వెచ్చించి రూ.5 కోట్లతో 7,900 సైకిళ్లు పంపిణీకి సిద్దం చేస్తున్నామని తెలిపారు. 15 మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లుగా అభివృద్ది చేసేందుకు దాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. దానిని కూడా వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్దికి రూ.850 కోట్ల నిధులు తీసుకువచ్చామని.. తన దగ్గర పనిచేసే వారినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, సోషల్ మీడియాలో కథనాలు ప్రచురించడం భావ్యం కాదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర
రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
Read Latest AP News And Telangana News And International News And Telugu News