నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్.. త్వరగా కోలుకోవాలని మంత్రి లోకేశ్ ఆకాంక్ష
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:14 PM
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
అమరావతి, జులై 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి (Brahmam Chowdary) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) స్పందించారు. బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
అయితే, కొన్ని రోజుల క్రితం బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల వివాహం జరిగిన విషయం తెలిసిందే. వారి వివాహా వేడుకలకు కూడా మంత్రి లోకేశ్ హాజరై ఆశీర్వదించారు.
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేశ్ తెలిపారు. ఆయన సతీమణి గౌతమీ శ్వేతతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించినట్లు చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

అలాగే మణిపాల్ ఆస్పత్రి వైద్యులతో కూడా నేరుగా మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సామాజిక ప్రముకులు కూడా బ్రహ్మం చౌదరి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News