పెట్టుబడుల గ్రౌండింగ్‌పైనే మా ఫోకస్.. సింగపూర్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం: నారా లోకేశ్
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:27 PM
పెట్టుబడుల గ్రౌండింగ్‌పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల గ్రౌండింగ్‌పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఏపీలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకోసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్‌తో (Edgar Pang Tze Chiang) మంత్రి లోకేశ్ ఈరోజు (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్‌తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు.
ఏపీలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం..
సింగపూర్‌తో ఏపీ భాగస్వామ్యం మరింత బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. భారత్ - సింగపూర్ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ కీలక పాత్ర పోషించారని లోకేశ్ ప్రశంసించారు. ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని ప్రస్తావించారు. రాష్ట్రంలో గతేడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందని వివరించారు.
సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం..
గతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానంలో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. సింగపూర్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు ఏపీ ఉపాధ్యాయుల బృందం వెళ్లిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. రష్యా పర్యటన విశేషాలను పంచుకున్నారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉంది: ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉందని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: అనిత
ట్రంప్, పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేయండి.. నానిపై శివనాథ్ సెటైర్లు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News