Share News

కర్నూలు, నరసరావుపేట నేతలకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు

ABN , Publish Date - Feb 26 , 2026 | 10:05 PM

కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టు గెదర్‌ని తలపించింది. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు.

కర్నూలు, నరసరావుపేట నేతలకు మంత్రి లోకేశ్ ఆత్మీయ విందు
AP Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టు గెదర్‌ని తలపించింది. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు. సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్‌గా డిన్నర్ మీటింగ్ జరిగింది. పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎక్కడ సెటిల్ అయ్యారంటూ లోకేశ్ వారిని అడిగి తెలుసుకున్నారు.


25 ఏళ్లకు అబ్బాయిలకు పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే పెళ్లయ్యిందని లోకేశ్‌ వారికి తెలిపారు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని తన కుమారుడు దేవాన్ష్‌ను కూడా ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నానని లోకేశ్‌ చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం నేతలు తనకు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో ఏం ఉన్నాయి..? ఏవి కాలేదు అనేవి తెలియజేసే నివేదికను ఆయా నేతలకు లోకేశ్ అందజేశారు. మహిళామణులకు మంగళగిరి పట్టుచీరలని యువనేత గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఆత్మీయ విందు ముగిశాక గేటు వరకూ వెళ్లి అందరికీ లోకేశ్ ఆత్మీయ వీడ్కోలు పలికారు.


ఈ ఆత్మీయ సమ్మేళనానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు మంత్రి టీజీ భరత్ (కర్నూలు), పీవీ పార్థసారధి (ఆదోని), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బీవీ జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్ (పెదకూరపాడు), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), చదలవాడ అరవింద్ బాబు (నరసరావుపేట), కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి), యరపతినేని శ్రీనివాసరావు (గురజాల), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల), ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

డయేరియా ప్రబ‌ల‌కుండా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 10:09 PM