బీసీలపై గొడ్డలి పార్టీ కక్షగట్టింది.. మంత్రి లోకేశ్ ధ్వజం
ABN , Publish Date - Jun 16 , 2026 | 06:11 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై గొడ్డలి పార్టీ కక్షగట్టిందని ధ్వజమెత్తారు.
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై గొడ్డలి పార్టీ కక్షగట్టిందని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి లోకేశ్ మాట్లాడారు. తన అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ల బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేశారని మండిపడ్డారు.
నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిందని మంత్రి లోకేశ్ ఆగ్రహించారు. అన్యాయంగా అమర్‌నాథ్ గౌడ్‌ని చంపేశారని.. ఆయన మృతిచెంది మూడేళ్లు అవుతోందని తెలిపారు. జగన్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో బీసీలపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించిందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ వల్ల అన్నివిధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ భరోసా కల్పించారు.
వైసీపీ పైశాచికత్వానికి పరాకాష్ట అమర్నాథ్ గౌడ్ హత్య: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ పైశాచికత్వానికి పరాకాష్ట అమర్నాథ్ గౌడ్ హత్య అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనంతా బడుగు బలహీన వర్గాలను వేధించడమేనని ఆగ్రహించారు. ఈరోజు(మంగళవారం) అమరావతి వేదికగా మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడారు. చేయాల్సిన అరాచకాలన్నీ చేసి ఇప్పుడు వైసీపీ నేతలు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కుట్రలతో రాష్ట్రంలో అలజడులే అజెండాగా జగన్ రెడ్డి అడుగులేస్తున్నారని దుయ్యబట్టారు. అమర్నాథ్ గౌడ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు మంత్రి కొల్లు రవీంద్ర.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News