ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు: మంత్రి డీబీవీ స్వామి
ABN , Publish Date - May 14 , 2026 | 07:50 PM
ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. ట్రాన్స్‌జెండర్స్‌కి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Dola Sri Bala Veeranjaneya Swamy) వ్యాఖ్యానించారు. ట్రాన్స్‌జెండర్స్‌కి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) వెలగపూడి సచివాలయంలో మంత్రి డీబీవీ స్వామి అధ్యక్షతన ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా డీబీవీ స్వామి మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్స్‌కి ఆస్పత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పిస్తామని చెప్పుకొచ్చారు.
ట్రాన్స్‌జెండర్స్‌కి స్వయం ఉపాధి..
బహిరంగ ప్రదేశాలు, ఆస్పత్రుల్లో ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సెర్ప్, మెప్మా సహకారంతో ట్రాన్స్‌జెండర్స్‌కి స్వయం ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. తిరుపతిలో గరీమా గృహం ఏర్పాటు చేసి నిరాశ్రయులైన వారికి ఆసరా కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ట్రాన్స్‌జెండర్స్‌లోని 676 మందికి ఇప్పటికే గృహాలు కేటాయించామని తెలిపారు. వారి రక్షణ కోసం సీఐడీ కేంద్ర కార్యాలయంలో స్వాభిమాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్‌లైన్ (1091) ఏర్పాటు చేశామని అన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌కి గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ప్రకటించారు. మనమిత్ర వాట్సాప్ యాప్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా వారు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డీబీవీ స్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం
నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
Read Latest AP News And Telangana News And International News And Telugu News