Share News

జర్నలిస్టులపై దాడులు, దౌర్జాన్యాలపై హైపవర్ కమిటీ

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండేళ్లపాటు కొనసాగనుంది.

జర్నలిస్టులపై దాడులు, దౌర్జాన్యాలపై హైపవర్ కమిటీ

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పాత్రికేయులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా కేసులను పరిశీలించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఛైర్మన్‌గా రాష్ట్ర హోంమంత్రి, వైస్ ఛైర్మన్‌గా సమాచార పౌర సంబంధాల శాఖ(ఐ అండ్ పీఆర్) మంత్రిని నియమించింది. హోంశాఖ, సాధారణ పరిపాలన శాఖ, ఐ అండ్ పీఆర్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించింది. లా అండ్ ఆర్డర్ విభాగానికి చెందిన ఐజీ కూడా ఇందులో సభ్యుడిగా ఉంటారు. గుర్తింపు పొందిన మూడు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు కూడా కమిటీలో సభ్యత్వం కల్పించారు. వీరితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులూ ఇందులో చోటు దక్కించుకున్నారు.


ఈ కమిటీకి ఐ అండ్ పీఆర్ డైరెక్టర్.. కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అయితే.. అవసరానికి అనుగుణంగా కమిటీలో ‌అదనపు సభ్యుడినీ కోఆప్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ కమిటీ జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులను పరిశీలించడం సహా ఆయా అంశాలపై సంబంధిత వర్గాల నుంచి వివరాలను సేకరించనుంది.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు.. అభినందించిన ప్రధాని మోదీ!

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

Updated Date - Sep 30 , 2026 | 08:52 PM