Share News

సమాజ ప్రగతిలో మహిళల పాత్ర కీలకం: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Mar 08 , 2026 | 08:43 AM

సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తికి సాటిలేదని.. ప్రతి అడుగులో ధైర్యం, ప్రతి సంకల్పంలో దృఢత్వం వెలకట్టలేనివని వ్యాఖ్యానించారు.

సమాజ ప్రగతిలో మహిళల పాత్ర కీలకం: హోంమంత్రి అనిత
AP Home Minister Vangalapudi Anitha

అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): సమాజ ప్రగతిలో భాగస్వాములైన మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి వేదికగా ఈరోజు (ఆదివారం) మీడియాతో మాట్లాడారు. మహిళా శక్తికి సాటిలేదని.. ప్రతి అడుగులో ధైర్యం, ప్రతి సంకల్పంలో దృఢత్వం వెలకట్టలేనివని వ్యాఖ్యానించారు. సమాజ ప్రగతిలో మహిళల పాత్ర కీలకమే కాదని, అది అద్భుతమైన మార్పుకు నాందని ఉద్ఘాటించారు.


ఆడబిడ్డల కలలు సాకారమయ్యే దిశగా అడుగులు..

మన ఆడబిడ్డల భద్రత, గౌరవం, సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి కలలు సాకారమయ్యే దిశగా అడుగులు వేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేద్దాం.. నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే.. ఆ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. మహిళా దినోత్సవ వేళ మహిళ ఆరోగ్యభద్రతే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లు ఉచితంగా అందిస్తున్నారని వివరించారు.


మహిళా ఆరోగ్యభద్రతే లక్ష్యం..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రతి గ్రామానికి చేరేలా కృషి చేస్తున్నారని వెల్లడించారు. మహిళా దినోత్సవ వేళ మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పని ఒత్తిడిలో పడి, మహిళలు వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. మహిళల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఈ మహిళా దినోత్సవం రోజు, ప్రతీ మహిళ తన ఆరోగ్యమే మహాభాగ్యమని భావించాలని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయాలని హోంమంత్రి అనిత సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 09:30 AM