Share News

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:23 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకు బదలాయించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు(సోమవారం) విచారణ జరిగింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో కీలక పరిణామం
Inner Ring Road Cas

అమరావతి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై (CM Chandrababu Naidu) జగన్ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐకు బదలాయించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు(సోమవారం) విచారణ జరిగింది.ఈ కేసుని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేసే అధికారం లేదంటూ.. ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధుల కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలంటూ వేసిన మరో పిటిషన్‌‌పై కూడా విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.


సీఎం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గీ హాజరయ్యారు. ఈ కేసు విచారణలో తమకు ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని విచారణ అర్హత మీద వాదనలు వినాలని న్యాయమూర్తిని సీనియర్ న్యాయవాది కోరారు. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ముకుల్ రోహిత్ కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ అభ్యర్థన మేరకు 16వ తేదీన వాదనలు వింటామని హైకోర్టు ప్రకటించింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని కేసులను16వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు..

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 03:22 PM