Share News

విస్తృత ప్రజాప్రయోజనానికే ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:08 AM

భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్నస్థలం అయినప్పటికీ ఆ భూమిని సేకరించే విషయంలో చట్టంలో నిర్దేశించిన విధానాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది.

విస్తృత ప్రజాప్రయోజనానికే ప్రాధాన్యం
AP High Court

  • అయితే చట్ట నిబంధనలను అనుసరించాల్సిందే

  • సీడ్‌ యాక్సిస్‌ భూసేకరణపై హైకోర్టు ధర్మాసనం

  • నిబంధనలు అనుసరించారా? లేదా?

  • అన్న అంశాన్ని సింగిల్‌ జడ్జే తేలుస్తారు

  • అధికారులు అక్కడే కౌంటర్‌ దాఖలు చేయాలి

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్నస్థలం అయినప్పటికీ ఆ భూమిని సేకరించే విషయంలో చట్టంలో నిర్దేశించిన విధానాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం కోసం తమ భూమిని సేకరించే విషయంలో చట్ట నిబంధనలు అనుసరించలేదని అప్పీల్‌దారు తరఫు న్యాయవాదులు చెబుతున్నారని గుర్తు చేసింది. నిబంధనలు అనుసరించారా? లేదా? అనే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలు సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.


ఈ నేపథ్యంలో భూసేకరణ వ్యవహారాన్ని సింగిల్‌ జడ్జి వద్దకే పంపిస్తున్నట్లు పేర్కొంది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలలో కౌంటర్‌ దాఖలు చేయాలని భూసేకరణ అధికారులను ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేసిన అనంతరం.. భూసేకరణ నోటిఫికేషన్‌ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని పిటిషనర్‌ చోడిశెట్టి నిర్మలత వేసిన అనుబంధ పిటిషన్‌పై వారం రోజుల్లో సింగిల్‌ జడ్జి నిర్ణయం వెల్లడించాలని పేర్కొంది. అనుబంధ పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి నిర్ణయం వెల్లడించే వరకు నిర్మలత స్థలం విషయంలో స్టేటస్‌ కో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తం కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 08:08 AM