Share News

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు..

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:24 PM

ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు..
Andhra Pradesh Government

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) శుభవార్త తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వయసు పెంపుదలపై మంత్రులు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమావేశమై చర్చించారు.


ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హెచ్‌ఆర్డీ మంత్రి నారా లోకేశ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. జగన్ హయాంలో నిరాకరించిన ఈ అంశంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపుపై ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 21 , 2026 | 04:30 PM