ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై నిషేధానికి అమలు తేదీ ఖరారు
ABN , Publish Date - Jul 06 , 2026 | 07:41 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై నిషేధానికి అమలు తేదీ ఖరారైంది. జులై 13వ తేదీ నుంచి పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్‌పై ఏపీ ప్రభుత్వం నిషేధం అమలు చేయనుంది.
అమరావతి, జులై 6 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై నిషేధానికి అమలు తేదీ ఖరారైంది. జులై 13వ తేదీ నుంచి పోస్టుల సృష్టి, అప్‌గ్రేడేషన్‌పై ఏపీ ప్రభుత్వం నిషేధం అమలు చేయనుంది. కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపై నిషేధం విధించింది. స్థానిక కేడర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిషేధం కొనసాగించనుంది. పీఓ-2025 అమలు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ (హెచ్‌ఆర్-ప్లానింగ్-పాలసీ) ఆధ్వర్యంలో ఈ మెమో జారీ చేసింది. కొన్ని శాఖల్లో కేడర్ కేటాయింపుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించింది.
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో నిషేధం అమలు తేదీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జులై 5వ తేదీతో ముగియాల్సిన ప్రక్రియకు అదనపు గడువు ఇచ్చింది. అన్ని శాఖలు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది. స్థానిక కేడర్ల పంపిణీ పూర్తయ్యే వరకు పరిపాలనా చర్యలపై పరిమితులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And And National News
And Telugu News