Share News

ఆ అధికారులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:08 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న 2018 గ్రూప్ వన్ పరీక్ష నుంచి ఎంపికైన అధికారులను ఫోకల్ పోస్ట్ నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు

ఆ అధికారులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Group-1 Officers

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న 2018 గ్రూప్ వన్ పరీక్ష నుంచి ఎంపికైన అధికారులను ఫోకల్ పోస్ట్ నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులందరూ వెంటనే సంబంధిత శాఖ అధిపతి వద్ద రిపోర్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. ఈ రోజు(బుధవారం) రాత్రి ఏడు గంటల్లోపు ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే, గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ఏపీ హైకోర్టు విచారణ చేస్తోంది.


ఫోకల్ పోస్టులో ఉన్న 2018 గ్రూప్-1 అధికారులందరినీ ఆప్రాధాన్య పోస్టుల్లోకి మార్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత వారం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని నిన్న(మంగళవారం) హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధర్మాసనం ముందు హాజరు కావాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. రేపటి(గురువారం)లోగా అధికారులందరినీ బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఫోకల్ పోస్టుల్లో ఉన్న అధికారులందరినీ రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్

వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 25 , 2026 | 05:39 PM