ఏపీలో ‘ఆదర్శ కుటుంబం AK47’ టికెట్ ధరల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:14 PM
ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ నటించిన 'ఆదర్శ కుటుంబం AK47' సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్టోబరు 30వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ నటించిన 'ఆదర్శ కుటుంబం AK47' (Venkatesh Adarsha Kutumbam AK47) సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అనుమతి ఇచ్చింది. అక్టోబరు 30వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై గరిష్ఠంగా రూ.75ల (జీఎస్టీతో కలిపి) పెంచింది.
ఈ మూవీకి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీవ్యాప్తంగా రోజుకు 5 షోలను ప్రదర్శించుకునేందుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు (10 రోజుల పాటు) మాత్రమే పెంచిన ధరలు అమలవుతాయని స్పష్టం చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత ఎస్. రాధాకృష్ణ విజ్ఞప్తి మేరకు ఏపీ హోంశాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News