ఏపీ ప్రభుత్వం కోసం లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్‌ల నియామకం
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:42 PM
ఏపీ ప్రభుత్వం కోసం లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్‌ల నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమరావతి, జులై 6 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం (AP Government) కోసం లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్‌ల నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర అమెరికాలో పెట్టుబడుల కోసం ప్రిన్సిపల్ లైజన్‌గా సతీశ్ మండువని ప్రభుత్వం నియమించింది. పశ్చిమాసియా, ఇతర దేశాలకు ప్రత్యేక ప్రతినిధిగా రాధాకృష్ణ రావిని నియమించింది.
యూరప్‌కు ప్రత్యేక ప్రతినిధిగా జయకుమార్ గుంటుపల్లి నియమించింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలకు ప్రత్యేక ప్రతినిధిగా శ్రీనివాస్ పల్లపోతు నియమించింది. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ సమన్వయానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధులను నియమించింది. జీఓ ఆర్టీ నంబర్ -1333 ద్వారా ఈ నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And And National News
And Telugu News