Share News

ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌‌తో గోదావరి కాలుష్యం అవుతోంది: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:11 PM

ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌ వల్ల రాజమండ్రి గోదావరి కాలుష్యమవుతోందని వ్యాఖ్యానించారు.

ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌‌తో గోదావరి కాలుష్యం అవుతోంది: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా పేపర్స్ యాజమాన్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌ వల్ల రాజమండ్రి గోదావరి కాలుష్యమవుతోందని వ్యాఖ్యానించారు. గోదావరిని కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. పన్ను మాత్రం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌ ఎగ్గొడుతోందని తెలిపారు. ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యిందని వెల్లడించారు.


పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు? అని నిలదీశారు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచి స్పందన ఎందుకు రావట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పన్నులు ఎగ్గొడుతూ కాలుష్యానికి కారణమవుతున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2016 తర్వాత ఒక్క రూపాయి పన్ను కూడా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. మొత్తం రూ.21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని అన్నారు. గోదావరి కాలుష్యానికి ఆంధ్ర పేపర్ యాజమాన్యమే కారణమని చెప్పారు. ఆంధ్రా పేపర్స్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని.. కాలుష్య నియంత్రణ మండలిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 05:01 PM