Share News

కేరళం కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

ABN , Publish Date - May 18 , 2026 | 04:23 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేరళం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

కేరళం కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
Pawan Kalyan

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కేరళం కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్‌కు (VD Satheesan) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.


కేరళం నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పారదర్శకమైన, ప్రగతిశీలమైన పాలనను అందిస్తూ కేరళం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. దేవుని సొంత దేశంగా పేరుగాంచిన కేరళం మరింత అభివృద్ధి, సుసంపన్నత సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 04:59 PM