Share News

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 08 , 2026 | 09:39 AM

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించలేదని ప్రశ్నించారు.

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandra babu Naidu

అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandra babu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించలేదని ప్రశ్నించారు.


ముర్ము తన పర్యటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఘటన దురుదృష్టకరమని... రాష్ట్రపతి పదవిని అవమానించేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించడం తనకు బాధకలిగించిందని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉందని సూచించారు. రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి పవిత్రతను కాపాడుకోవడం సమష్టి విధి అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 10:47 AM