తయారీ రంగంపై తైవాన్ ఆసక్తి
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:12 AM
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాతన, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపా యి. ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఆ దేశ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఆ దేశ కంపెనీల ప్రతినిధుల బృందం భేటీ
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీలో భాగస్వామ్యంపై చర్చలు
పారిశ్రామిక విధానాలు వివరించిన సీఎం
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాతన, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపా యి. ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఆ దేశ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది. తైవాన్ కం పెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సీఎంను కలిసింది. తైవాన్‌కు చెందిన డెల్టా ఎలక్ర్టానిక్స్, బెన్ క్యూ, సీబీటీసీ బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావోరెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయ్ టెక్, టెక్ టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాండ్‌సన్, జిలీ కనస్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైలు, రోడ్డు మార్గాలు వంటి పటిష్ఠ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ సహా ఏపీలోని తయారీరంగ ఎకో సిస్టమ్ గురించి ఆ బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. ఎలక్ర్టానిక్స్, సెమీ కండక్టర్లు, ఐటీ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ సహా ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారత్‌లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, ఈచర్చల సందర్భంగా అంగీకారం కుదిరింది.
శిక్షణపై లోకేశ్‌తో చర్చ
మంత్రి లోకేశ్‌తో తైవాన్ ప్రతినిధుల బృందం ప్రత్యేకం గా భేటీ అయ్యింది. ఏపీలో మా నవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన, విద్యాపరమైన సహకారంపై చర్చించారు. తై వాన్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ యువతకు తగిన నైపుణ్యం, సాంకేతిక శిక్షణ సహా, ఉన్నత విద్యకు సహకారంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఎలక్ర్టానిక్స్, సెమీ కండక్టర్ల తయారీ, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ర్టియల్ ఆటోమేషన్, హెల్త్‌కేర్, ఇతర అత్యున్నత నైపుణ్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ స్థాయి నైపుణ్య గ్రిడ్‌ను నిర్మించడంతో పాటు మాండరిన్ భాషలో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్, ఇంటర్న్‌షి్‌పలు, విద్యార్థి-ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, ఉద్యోగ-సన్నద్ధత కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగాయి. తైవాన్-ఏపీ మధ్య ఈ సమావేశం మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణిస్తున్నారు.
నేరగాళ్లకు పరామర్శలేమిటి?: చంద్రబాబు
‘వ్యవస్థలను నిర్మించేందుకు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారు. కానీ వ్యవస్థల్ని నాశనం చేయడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నేతలు పనిచేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. సీదిరి అప్పలరాజు పరామర్శకు జగన్ గురువారం వెళుతున్న విషయాన్ని నేతలు చెప్పారు. బాబు స్పందిస్తూ... ‘గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలిచేద్దామనుకున్న వారిని పరామర్శించి జగన్ ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? నేరస్థులను తయారు చేయడం, వారితో నేరాలు చేయించడం.. జైలులో పెడితే పరామర్శించడం.. ఇదే జగన్ నైజం.’ అన్నారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News