ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:57 AM
ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు.
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) ప్రారంభించారు. జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. రూ.40 కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు.. 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను సీఎం లాంఛ్ చేశారు.
గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు ఉపయోగపడనున్నాయి. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆయా వాహనాల ప్రత్యేకతలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమలో హోంమంత్రి వంగలపూడి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు కూడా చదవండి...
సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్
సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News