Share News

గుంటూరు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:24 AM

గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.

గుంటూరు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, జులై 18 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. గుంటూరు ఘటనలో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు అంగీకారయోగ్యం కావని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు పెట్టారు.


ఈ ఘటనలో నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. రాజకీయ అనుబంధం పేరుతో ఎవరికీ రక్షణ ఉండబోదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చిచెప్పారు. భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ మహిళల గౌరవం, భద్రతకు తాము కట్టుబడి ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


మహిళలను అవమానిస్తే సహించేది లేదు: నారా లోకేశ్

గుంటూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. రాజకీయ పలుకుబడి ఎవరినీ కాపాడదని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ పోస్టు పెట్టారు.


నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నాయకుడిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. పార్టీ పదవులన్నింటి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మహిళలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మహిళలను అవమానించిన వారికి చట్టప్రకారం కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 12:24 PM