జీఎస్డీపీ గ్రోత్‌పై ఫోకస్.. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చలు
ABN , Publish Date - May 07 , 2026 | 10:56 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. సచివాలయం ఐదో బ్లాకులోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుకు సీఎస్ సాయిప్రసాద్, పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు సీఎం చంద్రబాబుకు.. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు అభినందనలు తెలిపారు.
జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారిగా జీఎస్డీపీ అంచనాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ గ్రోత్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పీయూశ్ కుమార్, రోనాల్డ్ రోస్, వినయ్ చంద్ ఇస్తున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో తమ సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులు అందించారు. సింగపూర్ ట్రైనింగ్ వివరాలపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, విద్య - వైద్యం, పెట్టుబడుల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై సీఎం సమీక్షిస్తున్నారు. వివిధ జిల్లాల్లో అవలంభిస్తున్న ఉత్తమ పద్ధతులను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News