ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:39 PM
డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తే తనకు ఎక్కడ పేరు వస్తుందోనని వైసీపీ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తే తనకు ఎక్కడ పేరు వస్తుందోనని వైసీపీ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు (శనివారం) అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మెగా డీఎస్సీ ఇచ్చి ఉద్యోగాలిస్తే.. వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపై 350 పిటిషన్లు వేశారని మండిపడ్డారు.
మెరిట్‌పైనే పోస్టులు ఇచ్చిన సంప్రదాయం తమది అని సీఎం వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపిందని ఆగ్రహించారు. పకడ్బందీగా చేయాల్సిన ఏపీపీఎస్సీని అస్తవ్యస్తం చేశారని దుయ్యబట్టారు. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లోనూ ప్రక్షాళన అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News