Share News

ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:42 PM

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. ఈ క్రమంలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
AP CM Chandrababu Naidu

అమరావతి, జులై 12 (ఆంధ్రజ్యోతి): ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతికా ప్రదీప్, చికిత తానిపర్తి జట్టుకు సిల్వర్ మెడల్ లభించింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన పోటీల్లో భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన కనపరిచింది. ఈ క్రమంలో విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.


ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై జ్యోతి సురేఖ ప్రతిభ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. ఏపెక్స్-2036 ద్వారా మరెందరో ఛాంపియన్లను తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. టోర్నమెంట్‌లో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 02:54 PM