Share News

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:55 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
AP CM Chandra babu Naidu

అమరావతి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటించనున్నారు.

సీఎం షెడ్యూల్ వివరాలివే..

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (సోమవారం) మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరి వెళ్తారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో సీఎం అత్యంత బిజీ షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆయన ఓటర్లను అభ్యర్థించనున్నారు.


కీలక బహిరంగ సభలు, రోడ్డు షోలు..

చంద్రబాబు పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించేందుకు ఎన్డీఏ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. చెన్నై సమీపంలోని ఆవడిలో చంద్రబాబు భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల గెలుపు ఆవశ్యకతను ఆయన ప్రజలకు వివరించనున్నారు.


రాజకీయ ప్రాధాన్యం..

దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు ప్రచారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులోని సరిహద్దు జిల్లాలు, చెన్నై నగరంలో తెలుగు వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు రాకతో ఆ ఓట్లు ఎన్డీఏకు వస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలోపేతానికి చంద్రబాబు తన వంతు సహకారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన దృష్ట్యా తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరు ప్రాంతాల్లో తెలుగుదేశం, ఎన్డీఏ శ్రేణులు ఇప్పటికే భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశాయి. రేపు మధ్యాహ్నం నుంచి సీఎం పర్యటన ప్రారంభం కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ హయాంలో పేదలకు అన్నం లేకుండా చేశారు.. సీఎం ధ్వజం

స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ

వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 19 , 2026 | 10:59 AM