Share News

ఏపీలో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చెప్పారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఏపీలో కూడా బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరినట్టు వెల్లడించారు.

ఏపీలో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌
Undrajavaram Buddha Vihar

  • దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రిని కోరాం

  • మైత్రేయ బుద్ధవిహార్‌ ప్రాచుర్యానికి సహకరిస్తాం: మంత్రి దుర్గేశ్‌

ఉండ్రాజవరం, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చెప్పారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఏపీలో కూడా బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరినట్టు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా కోట్లాది రూపాయల వ్యయంతో బుద్ధగయ తరహాలో నిర్మించిన మైత్రేయ బుద్ధవిహార్‌ను బుధవారం ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ... మైత్రేయ బుద్ధవిహార్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా విశ్వవ్యాప్తం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ఆదుర్రు, బావికొండ, తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఉండ్రాజవరం వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తొలుత మంత్రి దుర్గేశ్‌ జాతీయ జెండాను ఎగురవేయగా.. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీలంకలోని నాగానంద ఇంటర్నేషనల్‌ బుద్ధిస్ట్‌ యూనివర్సిటీ ఫౌండర్‌, వైస్‌చాన్సలర్‌ బోదగమా ఛాందిమా తెరో బుద్ధిజం జెండాను ఆవిష్కరించారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 07:46 AM