Share News

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు 23 వరకు పొడిగింపు

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:23 PM

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువును ఆంధ్రప్రదేశ్ సర్కార్ పొడిగించింది. ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది.

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు 23 వరకు పొడిగింపు
AP Liquor Shops

అమరావతి, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మద్యం దుకాణాల (AP Liquor Shops) రెన్యువల్ గడువును ఆంధ్రప్రదేశ్ సర్కార్ పొడిగించింది. ఈ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఏ4 మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు 2026–27 సంవత్సరానికి దుకాణాల రెన్యువల్ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది.


పలు షాపులు రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏపీవ్యాప్తంగా 2026–27 సంవత్సరానికి 3,650 ఏ4 మద్యం దుకాణాలు నోటిఫై కాగా.. ఇప్పటివరకు 2726 షాపులు రెన్యూవల్ చేసుకున్నాయి. ఇప్పటి వరకు రూ.676 కోట్లను ఆయా షాపుల నుంచి ఏపీ సర్కార్ వసూలు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 08:41 PM