ఏపీ వ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు..
ABN , Publish Date - Sep 27 , 2026 | 08:34 AM
ఏపీ వ్యాప్తంగా ఆహార భద్రత శాఖ ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ మేరకు పలు హోటళ్ళు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.
అమరావతి, సెప్టెంబర్, 27: ఆహార భద్రత శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు హోటళ్ళు, రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ మేరకు నిబంధనలు పాటించని సంస్థలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా యజమానులపై కేసులు నమోదు చేసింది. ఆహార భద్రత శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 28 జిల్లాలో ఉన్న 70 హోటళ్లు, రెస్టారెంట్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆహార భద్రత నియమాలు పాటించడంలేదనే ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన 25 రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు అధికారులు తెలిపారు. మరో 15 సంస్థలకు షోకాజు నోటీసులు జారీ చేశామని తెలిపారు. అంతేకాకుండా.. సంబంధిత యాజమాన్యాలపై 30 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 10 కేసులను ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ లేనికారణంగా నమోదు చేయగా.. మిగతా కేసులు అపరిశుభ్రత, నాసిరకం ఆహారపదార్థాలు, కుళ్ళిపోయిన పదార్థాలను వినియోగిస్తున్నందుకు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ దాడులకు సంబంధించిన నివేదికను ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News